Wednesday, December 14, 2011

గాడ్ ఫాదర్ ఎవ్వరు?

వైయెస్సార్ చనిపోయిన తర్వాత( ఆయన బతికుండగా మాటాడ్డానికి ఈగుంటనక్కలకి దమ్ములెక్కడున్నయిలెండి!) టి షర్టులేసుకొనే కొంతమంది టి.డి.పి పిల్ల నాయకులు, పరిటాల రవిని చంపిన మొద్దు శీనుని, అది పోస్టు మార్టం చేసిన డాక్టరుని చంపించిన గాడ్ ఫాదరెవ్వరు? అంటూ అది వైయెస్సారే అనే అర్ధం వచ్చే విధంగా కూతలు కూసారు. అలా రెండు మూడు సార్లు కూసాక మళ్ళీ ఎవడూ ఆ మాట అంటే వినలేదు. బహుశా చదువుకున్నవడెవడో చెప్పిండాలి గాడ్ ఫాదర్ సినిమా క్లైమేక్స్ ఏంటో!
గాడ్ ఫాదర్ అంటే గుర్తొచ్చిందీ..ఇంతకీ గాడ్ ఫాదర్ చంపాల్సిన అవసరం ఎందుకొచ్చిందీ ఆయన శత్రువులకి ఆ నవల్లో?
సొలొజ్జో అనే ప్రమాదకరమైన బిసినెస్స్ మేన్ ఒకడుంటాడు. వాడికి బాగా లాభంవచ్చే ఒక బిసినెస్స్ గాడ్ ఫాదర్ స్టేట్లో చెయ్యడానికి గాడ్ ఫాదర్ సహాయం అడుగుతాడు. జనహితం కోరే గాడ్ ఫాదర్ ఏమో ఒప్పుకోడు. అప్పుడు సొలొజ్జో అదే స్టేట్లో ఉన్న గాడ్ ఫాదర్ శత్రువులతో చేతులు కలిపి గాడ్ ఫాదర్ ని చంపించే ప్రయత్నం చేస్తాడు.అదీ కథ. నవల్లో గాడ్ ఫాదర్ శత్రువుల దాడిలో చావడు. కానీ మన స్టేట్లో మాత్రం విలన్లు బాగనే సక్సెస్స్ అయ్యారు. నాయకుడు నేలకొరిగాడు.
  నెల నెలా డబ్బులిస్తాం, ఇదిగో ఇప్పుడే ఎ టి యం కార్డు. కలర్ టీవీలిస్తాం, దండగ అన్న ఆ నోటితోనే 9 గంటలు ఫ్రీగా కరంట్ ఇస్తాం..అంటూ సిధ్ధాంతాలూ,విలువలూ అన్నీ తీసి గట్టుమీద పెట్టి ఒక పక్క కేసీయార్ ఇంకో పక్క కులతత్వానికి వ్యతిరేకంగా భీభత్సంగా పోరాడే, మన కులానికే చెందిన ఎర్రపార్టీలోళ్ళని కలుపుకుని పోరాడినా జనం కలుపుమొక్కల్ని ఏరినట్టు ఎరేసేసరికి బిత్తరపోయిన బాబు గారు( అలిపిరి బాంబు దెబ్బకి బిత్తరపోయి పిచ్చి చూపులు చూస్తున్న ఆ మొహం ఇంకా కళ్ళముందు కదలాడుతూనే ఉంది నాకు)..


ఎన్ని అబధ్ధాలురాసి జనాన్ని మభ్యపెట్టినా జనం తన పేపర్కి ఈనాడు పొద్దునే బాథ్రూంలో తుడుసుకోడాఅనికి వాడిన గలీజు పేపర్కిచ్చిన విలువకూడా ఇవ్వకపోవడంతో నెత్తిన గుడ్డెసుకున్న డ్రామోజీ...


జనంగుండెల్లో అందనంత ఎత్తుకెదిగిన వైయెస్సార్ని ఆపలేక, గెలిసే దమ్ములేక, ఈదేశాన్ని దాని వనరులని దోచుకొడానికి, అడ్డువచ్చిన నాయకులని కొనేయడానికి అలవాటుపడ్డ సొలొజ్జో లాంటి ఒక నీతిలేని బిసినెస్స్  మేన్ తో చేతులు కలిపి,  వెనకనుంచి దాడి(అలవాటైన పని కదా బాబుగారికి)చేసి అడ్డైతే తొలిగించుకున్నారు. కానీ అచ్చం గాడ్ ఫాదర్ నవల్లో లాగే - తండ్రిని మించిన తనయుడు తండ్రికన్నా వేగంగా జనం గుండెల్లో చోటు సంపాదించుకొనే సరికి మళ్ళీ పేంట్లు తడుపుకున్నారు.ఇక లాభంలేదని..
అబధ్ధాలు చెప్పడానికి అలవటుపడిపోయిన బాబుగారు 'నేనే అన్నా" అని బయలు దేరాడు. జాతీయ జెండాతో మంచి ఫొటో షూట్ చేయించుకుని ఊరిమీద పడ్డాడు.
ఏ చెట్టూ లేనిచోట ఆముదం చెట్టే మహావ్రుక్షం అన్నట్టు వైయెస్సార్ లేని రాష్ట్రంలో నేనే నాయకుడిని అని చంకలు గుద్దుకుంటుంటే...ఈయన చేసిన పాపాలు చుట్టచుట్టి పకడ్బందీగా హై- కోర్టులో సాక్ష్యాలతో సహా కేసేసారు దివంగత నేత సతీమణి. తేలుకుట్టిన దొంగలా అయిపోయాడు బాబు. కానీ ఆయనేమీ ఒంటరి దొంగ కాదు కదా. అసలు ఒకలికొకళ్ళు సహాయం చెసుకోకపోతే ఇంతలా కొల్లగొట్టగలిగేవాళ్ళా ఈ పరమ నీచ దొంగలూ?
"రాజకీయాలంటే కొనడం ..అమ్మడం' అంటాడు ఆమధ్య రిలీజైన సినిమాలో హీరో. కొనడం మన బాబుకి వెన్నతో పెట్టిన విద్య. (వైస్రాయ్ ఎపిసోడ్ అంతా కొనడం అమ్మడమేగా). అసలు ఆ సైకిల్ గుర్తు కూడా అలా కొన్నదే అని అంటారు. (తెలుగు మహిళ ఎవరో ఈయన్ని తా-డు గాడు అని తిట్టినట్టు  గుర్తు.)
అయ్యా.అలా బయట పడ్డాడు ప్రస్తుతానికి మన క్రిమి. మైండ్. కానీ ఇక్కడ అర్ధం కానిదొక్కటుంది. గాడ్ ఫాదర్ నవల్లో గాడ్ ఫాదర్ పే రోల్లో చాలా మంది జడ్జీలుంటారు. కానీ ఇక్కడ వైయెస్సర్ పేరోల్లో ఎవరూ ఉన్నట్టు లేరు. కానీ మన క్రిమి. గారు బయట పడ్డ విధానం చూస్తుంటే ఒక అనుమానం వస్తుంది. ఇంతకీ గాడ్ ఫాదర్ దివంగత నాయకుడా? లేక మన గుంటనక్కా? అని.