Tuesday, September 13, 2011

జగన్ వ్యతిరేకులని కలుపుతుంది మతం కూడానా?

జగన్ వ్యతిరేకులని కలుపుతుంది మతం కూడానా? అవుననే అనిపిస్తుంది. స్వాతంత్రం వచ్చి ఇంతకాలం అయినా, మనని పరిపాలించిన నాయకులలో ఒక స్ఫూర్తిని, ఉత్తేజాన్ని ఇచ్చిన నాయకులని వేల్లమీద లెక్కపెట్టొచ్చు. అప్పుడెప్పుడో ఒక వివేకానందుడు, తర్వాత ఇందిరా గాంధి తప్ప ఒక తెగువని , ధైర్యాన్ని నాయకత్వ లక్షణాలని చూపించిన నాయకుడెవరు? మీడీయాని మేనేజ్ చేసి ఒక అబద్ధపు ఇమేజీ స్రుష్టించుకుని ప్రజలని మోసంచేసి దొంగదారిలో గెలిచిన కుహానా నాయకులు తప్ప? కొంతమంది నాయకులకి కులమే బలం. దానిలో పత్రిక , ఒక చానెలు, అదే కులానికి చెందినా సినీ తారలు,వ్యాపారవేత్తలు అంతా కలిసి జనానికి కళ్ళకి గంతలు కట్టి ఒక అభద్దాన్ని  గోబెల్సు ప్రచారంతో నిజంచేసేద్దామని ఆత్రం.ఇంకో పార్తీకి మతవిధ్వేషాలే ఇంధనం. ఒక మతానికి వ్యతిరేకంగా ఉద్వేగపూరితమైన ప్రసంగాలు చేయడం, రెచ్చగొట్టడం అధికారం అండతో దారుణ మారణ కాండకి పాల్పడడం...వీళ్ళామన నాయకులు? ఐనా మన బ్లాగర్లలో కొంత మందికి వీల్లంతే ఎంతొ ప్రేమ. ఒక నరహంతకుడిని చూసి "అహా ఎంత గొప్ప నాయకుడు అని మురిసిపోతుంటారు. మన లోంచి లక్షల కోట్లు దొచుకుపొతున్నాడు వాడు దొంగరా బాబూ అని కాగ్ అరుస్తున్నా అబ్బే అతను మహా గొప్ప వ్యాపారవేత్త అతనినుంచి ఎంతొ నేర్చుకొవాలి" అని ముచ్చట పడిపోతుంటారు మన బ్లాగర్లు. వాళ్ళకి వ్యతిరేకంగా ఒక్క పోస్టు రాయరు. తేలు కుట్టిన దొంగల్లా కిమ్మనరు.అదే జనాల మనసులు గెలిచిన, కుల రాజకీయాలు చేస్తున్న వెన్నుపోటు దొంగలకి, మాటలతో మాయ చేసే ముసలిమాంత్రికులకి రొమ్ము ఒడ్డి
నిలిచిన   రాజశేఖర రెడ్డి ని చూసి మాత్రం వీళ్ళలో దొంగ దేశభక్తి పొంగి పొర్లిపోతుంది. "శామ్యూల్ రెడ్డి గారు ,ఆయన నమ్ముకున్న "దేముడూ అంటూ ఒక మతాన్ని కించపరిచే ఏ అవకాశం ఒదులుకోరు ఈ కుహనా దేశభక్తులు, సంకుచిత మనస్కులు. అంటే మన మతం వాడు మర్డర్ చేసినా పరవాలేదు, మన ఇంట్లో పడి మన మన సొమ్మంతా దోచేసుకున్నా పర్వాలేదు. కానీ వేరే మతంవాడు గానీ ప్రజల గుండెల్లో చిరస్తాయిగా నిలిచే నాయకుడిగా ఎదిగాడా ? తట్టుకోలేరు ఈ నూతిలోని కప్పలు. ఎప్పటికి ఎదుగుతారో వీళ్ళు? ఎప్పటికి మారతారో?